రంగుల మహోత్సవాన్ని పర్యవేక్షించిన ఉత్సవ కమిటీ సభ్యులు కొలిపాక హైమావతి , కల్లూరి శ్రీవాణి ఓర్సు సూరమ్మ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 20 జగ్గయ్యపేట పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవ కార్యక్రమాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆదేశాలతో, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు సూచనలతో ఉత్సవ కమిటీ సభ్యులు కొలిపాక హైమావతి( బ్రహ్మం ), ఓర్సు సూరమ్మ కల్లూరు శ్రీవాణి సోమవారం నాడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు రెండేళ్లకు ఒకసారి జరిగే రంగుల మహోత్సవ కార్యక్రమంలో తమకు సేవ చేసే భాగ్యం కలగడం అమ్మవారి దయ అని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు.