రాష్ట్ర స్తాయి అథ్లెటిక్ పోటీల్లో గాంధారి క్రీడాకారిణి ప్రతిభ

పయనించే సూర్యుడు గాంధారి 20/01/26 రాష్ట్ర స్తాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో గాంధారి మండలం కేంద్రానికి చెందిన సాయి చెల్సియా రాథోడ్ అండర్ 8 విభాగం లో 60 మీ పరుగు పందెంలో ద్వితీయ స్థానం పొందినట్లు బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రాన్ గుగ్లోత్ సురేందర్, అధ్యక్షురాలు సేవంత తెలిపారు. ఈ నెల 18 న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిర ప్రియదర్శిని క్రీడా మైదానంలోజరిగిన పోటీల్లో మొదటి నుండి పోటీ పడిన చెల్సియా సిల్వర్ మెడల్ సాధించింది, గత ఏడాది తృటిలో స్థానం పోగొట్టుకున్న ఈమె కసి పట్టుదలతో శ్రమించింది. రాష్ట్ర స్తాయి లో గెలుపొందిన చెల్సియా రాథోడ్ కి పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.