రెండు అదనపు తరగతి గదుల కోసం సొంత నిధులు వెచ్చించి నిర్మాణం

పయనించే సూర్యుడు, కోరుట్ల జనవరి 20 కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో నిమిషకవి నవీన్ -దివ్య, గోనె సురేందర్ - మేఘన శిశుమందిర్ లో రెండు అదనపు తరగతి గదుల కోసం సొంత నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అయిలాపూర్ గ్రామ ఉపసర్పంచ్ వనపర్తి సౌమ్య క్రాంతి, విద్య పీఠం కరీంనగర్ ఇంచార్జీ కాటం రవీందర్, జిల్లా కార్యదర్శి బండారి కమలాకర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేముల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం, కోరుట్ల అధ్యక్షుడు వేముల రవి కిరణ్, స్థానిక నాయకులు రమేష్, రాములు, గోపి, రాజు, సురేష్, సుదర్శన్, తుకారం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.