పయనించే సూర్యుడు జనవరి 20 ఎన్ రజినీకాంత్ భీమదేవరపల్లి:- రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఎస్సై దివ్య పేర్కొన్నారు.. ఈ సందర్భంగా జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ & అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు.. అనంతరం అధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, రోడ్డు ప్రమాదాలలో మరణించిన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి, వారి మనోవేదన తెలుసుకున్నారు.. ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవచ్చని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటివి నిరాకరిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవుని సూచించారు.. ఈ కార్యక్రమంలో వంగర పోలీస్ సిబ్బంది, రోడ్డు ప్రమాదాల బాధితులు తదితరులు పాల్గొన్నారు.