శత శాతం ఉత్తీర్ణత సాధించాలి

★ త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు జరగాలి ★ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పయనించే సూర్యుడు జనవరి 20. పాపన్నపేట్ మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ కొడపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల పాఠాల బోధన, ఎలా చదువుతున్నారు. హాజరు ఎలా ఉందని అడిగారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలన్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టు లలో వెనకబడి ఉన్నారో తెలుసుకొని వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కొడపాక గ్రామంలో నూతనంగా నిర్మింస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆరోగ్యం, హౌసింగ్ ఏఈ అరుణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.