పయనించేసూర్యుడు జనవరి 20 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) ఆదోని పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ.ఫ్యాక్షన్ లేని పల్నాడు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.ప్రజలు బుద్ధి చెప్పినా,ఇంకా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదు. గ్రామాల్లో జరిగిన వ్యక్తిగత ఘర్షణలకు కూడ రాజకీయ రంగు పూసి, ఎవరు చనిపోతారా లబ్ధి పొందుదామని వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్సార్‌సీపీ నయా డ్రామా.రాజకీయం అంటే ప్రజా సేవ అని కొందరు నమ్మితే,శవం కనిపిస్తే చాలు దాని మీద రాజకీయం చేయాలని తహతహలాడటం వైఎస్సార్‌సీపీకి వెన్నతో పెట్టిన విద్యగా కనిపిస్తోంది.పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ మృతిని ఒక రాజకీయ హత్యగా చిత్రీకరించి,రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్న జగన్ రెడ్డి,బృందం తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. సాల్మన్ బాధితుడా? లేక బాధితుడనే ముసుగులో నేరగాడా?వైసీపీ నేతలు సాల్మన్‌ను ఒక అమాయకుడిగా, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన నేతగా కలరింగ్ ఇస్తున్నారు. సాల్మన్‌పై ఉన్నవి ఒకటి రెండు కాదు,ఏకంగా 12 కేసులు! అందులో సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళపై రేప్ కేసు,5 క్రిమినల్ కేసులు,6 దొంగతనం కేసులు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిల అండతో సాల్మన్ సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దళితుల భూములను కబ్జా చేయడం, కప్పం కట్టాలని వేధించడం వంటి చర్యలతో గ్రామాన్నే వణికించిన చరిత్ర ఇతనిది.సాల్మన్ ఆగడాలు తట్టుకోలేక 40 దళిత కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయంటే అతను ఎంతటి ‘నరరూప రాక్షసుడో’ అర్థమవుతోంది. సాల్మన్ ఆస్పత్రిలో. ప్రాణాలతో. కొట్టుమిట్టాడుతున్నప్పుడు పట్టించుకోని కాసు మహేష్ రెడ్డి,అతను చనిపోయాడని తెలియగానే సీన్ లోకి రావడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? శవాన్ని అడ్డం పెట్టుకుని గ్రామంలో గొడవలు సృష్టించి,తద్వారా జగన్ మోహన్ రెడ్డిని రప్పించి సింపతీ’ డ్రామా ఆడాలని వేసిన ప్లాన్ పోలీసులు అడ్డుకోవడంతో అట్టర్ ఫ్లాప్ అయింది అధికారం కోల్పోయిన కక్షతో క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తుల మరణాలను కూడా రాజకీయ పెట్టుబడిగా మార్చుకోవాలని చూడటం నీచమైన చర్య పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రేరేపించి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలకు ప్రజలే మళ్లీ ఇంకా బాగ్ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చనిపోయిన వ్యక్తి చరిత్రను దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం ఆడే ఈ శవ రాజకీయాలు,ఏపీ రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అని అన్నారు.