పయనించే సూర్యుడు జనవరి 20 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోనీ కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీజ్ఞాన సరస్వతి దేవాలయ15వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమ వారం నాడు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి మహాభిషేకం, ద్వాజారోహణం, అఖండ దీపారాధన, గోపూజతో పూజలను దేవాలయ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్ అర్చక బృందంతో ఆలయంలో నవగ్రహ పూజలు, పుణ్య వాచనం ఇతర పూజలు నిర్వహించి అనంతరం గణపతి హోమాన్ని దొడ్ల ఈశ్వర్ రెడ్డి, ఇందుమతి దంపతులతో ప్రత్యేకంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు సరస్వతి అమ్మవారి మూలవిరాట్ కు సామూహిక అభిషేకాలు ప్రాతకాల పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఉదయం 10గంటలకు నవగ్రహ హోమము, గో కల్యాణము, గోతులాభారం, ఓం శ్రీ రక్షా కోలాట బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు గోమాతలచే ఊరేగింపు, ప్రదోషకాల పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసకార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయని ఆయన అన్నారు. ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం చేశారు. భక్తులకు నిత్య అన్నప్రసాద సత్రంలో సామూహిక భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, మిడిదొడ్డి పాండు రంగయ్య, సోమిశెట్టి రవికుమార్, దొడ్ల ఇందుమతి, భూపాల్ రెడ్డి, ఆల్లంపల్లి శివకుమార్, మాధవి అర్చకులు పవన్ కుమార్ వివిధ ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.