
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 20 జగ్గయ్యపేట మండలం,షేర్ మహమ్మద్ పేట గ్రామంలో సోమవారం ఉదయం ఘనంగా నగర సంకీర్తన (జ్యోతి)కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుండి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దీక్ష స్వాముల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. షేర్ మహ్మద్ పేట గురుస్వామి అమరబోయిన దుర్గారావు నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి విశిష్ట గురువులుగా ప్రసాద్ స్వామి, వసంత స్వామి పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తిరుపతమ్మ అమ్మవారి దీక్ష స్వాములు పెద్ద సంఖ్యలో జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని రాజగోపాలస్వామి వారి దేవాలయంలో స్వాములకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు.