పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 20, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం నారాయణపురం 3 అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీ సామినేని మురారి సీనియర్ జర్నలిస్ట్ మనవరాలు చిరంజీవి కంచేటి తను శ్రీ ప్రియ పుట్టిన రోజు సందర్భంగా బేబి చైర్స్, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కుర్చీలు, చాపలు, వాటర్ క్యాన్స్, కుక్కర్ లు, టేబుల్స్, మొదలైన సుమారు 20,000 ల రూపాయల విలువైన వస్తువులు సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వైరా వారి ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ మండలం ఎంపీడీవో ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన వస్తువులు పంపిణీ చేయటం అభినందనీయం అన్నారు. ఈ వస్తువులు పిల్లల కోసం మరియు గర్భిణీ స్త్రీలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పారు. తల్లాడ ఎంఈఓ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అవసరం అనేవారికి ఉపయోగకరంగా ఉన్నాయని, ఇలా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్న సన్ రైజ్ సంస్థ వారికి అభినందనలు తెలిపారు. బీజేపీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో రోజువారీ ఉపయోగించే వస్తువులు పంపిణీ చేయటం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటాయి అని, వీటిని సదుపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాలతీ దాస్, ఏనుగు కిరణ్ బాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
