పయనించి సూర్యుడు: జనవరి 20 సత్తుపల్లి, నియోజకవర్గం: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఈనెల 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరుగుతున్న ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అలాగే 25వ తేదీన జరిగే బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనలని పిలుపునిస్తూ కల్లూరులో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ప్రభుత్వం చీరల్ని పంచడం కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉండి అర్హులైన ప్రతి మహిళకు చీరలను పంచాలని , మహిళలకు ప్రభుత్వం ఇస్తానన్న 2500 రూపాయల పథకాన్ని వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాటి పండ్ల కేజీయ,నిర్మల, మల్లీశ్వరి ,స్వప్న చిట్టెమ్మ, పావని, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.