
పయనించే సూర్యుడు జనవరి 20 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఉద్యమం 64వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆదోని రూరల్ మండల బీజేపీ నాయకులు ఉషారాజ్ దీక్షలో కూర్చొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఉషారాజ్ మాట్లాడుతూ.. ఆదోని చారిత్రక, భౌగోళిక, జనాభా పరంగా జిల్లా అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించడం ప్రజల న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు జరిగే వరకు పోరాటం ఆగదని, పార్టీలకతీతంగా ప్రజలంతా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నిరాహార దీక్షలో బి.జె.పి ఆదోని మండల అధ్యక్షులు బి.ఉషా రాజు కె. కోసిగయ్య - జి.కె. అంజనేయులు, బి. రామకృష్ణ (న్యాయవాది) ఇస్వీ నాగప్ప (ఉపాధ్యక్షులు) నవీన్ సింగ్ - (కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు),కరవ రవి కుమార్,రాజ బాబు, మహేంద్ర, శ్రీనివాసులు వినూత్న గుప్త (బిజెపి నాయకురాలు) జి. గోపాల్, ఉసేని, జి. రామకృష్ణ, వెంకటేష్, నాగేష్, లక్ష్మన్న, రాజేష్,సదాపురం రమేష్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.