అఖండ జ్యోతి స్థాపనతో ప్రారంభమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు…

* ఎన్టీఆర్ జిల్లా... పెనుగంచిప్రోలు... * శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరణాళ్ళ మహోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి,

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 5 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున అంగరంగ వైభవంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి నిత్య కళ్యాణం మండపం వద్ద విశేష పూజలు నిర్వహించిన అనంతరం, అమ్మవారి గర్భాలయంలో అఖండ జ్యోతి స్థాపనతో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి, ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి మహేశ్వర రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *