అల్ప మోడల్ పాఠశాలలో విద్యార్థులతో ఘనంగా హోలీ సంబరాలు

పయనించే సూర్యుడు మార్చ్ 5 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల చేత ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరికొకరు రంగులతో సరదాగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ హోలీ పండుగ యొక్క గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య, భార్గవి, మహర్జన, పూజ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *