ఉట్నూర్ లో లైన్ మెన్ దినోత్సవం సందర్భంగా సర్టిఫికెట్ల అందజేత

పయనించే సూర్యుడు మర్చి 05 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం లైన్ మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని లైన్ మెన్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహించే లైన్ మెన్‌ల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు వర్షం ఎండ రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు వారు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా లైన్ మెన్‌లు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడంలో తమ బాధ్యతను గుర్తుంచుకుని సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శాఖ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *