ఎవిఎన్ఎల్ సుందరరామయ్య కి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 5 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజు న మండల పరిషత్ కార్యాలయం పెనుగంచిప్రోలు లో మండలపరిషత్ అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎవిఎన్ఎల్ సుందరరామయ్య కి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటుచేయడమైనది. ఈ కార్యక్రమంలో లో ఎంపీపీ మార్కపూడి గాంధీ మాట్లాడుతూ ఏఈ. సుందర రామయ్య ఉద్యోగాన్ని ఎంతో అంకితభావంతో పని చేసి ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా అందరి మన్ననలు పొందారు, కావున ప్రస్తుతం పనిచేయుచున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ సుదరరామయ్య ని ఆదర్శంగా తీసుకొని పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని తెలియజేశారు, ఎంపిడిఓ జీ శ్రీను కూడా సుందరరామయ్య సిన్సియారిటి గురించి తెలియజేశారు, జడ్పిటిసి సభ్యురాలు ఊట్ల నాగమణి , సర్పంచ్ లు, ఎంపీటీసీలు మెంబెర్స్, మండలస్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శులు, ఎంపిడిఓ ఆఫీసు సిబ్బంది,సన్మాన గ్రహీత ఏవిఎన్ఎల్ సుందర రామయ్య వారి లక్ష్మి సుజాత పాల్గొన్నారు, ఎంపిడిఓ, పెనుగంచిప్రోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *