ఒకటవ వార్డులో సింగల్ ఫెస్ మోటార్ల ఏర్పాటు

* వార్డు మెంబెర్ అల్వాల స్వప్న సుల్తాన్ ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు మార్చి 5 నాగర్ కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ తెల్కపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో మంచి నీటి సరఫరా కోసం మూడు సింగల్ ఫెస్ మోటార్లను సర్పంచ్ నవ్య మల్లచారి ఏర్పాటు చేశారు ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం గ్రామంలో ఎక్కడ కూడా నీటి కొరత ఉండోద్దని ప్రజలు ఇబ్బంది పడొద్దని. వచ్చేది వేసవికాలం కాబట్టి ప్రజలకు నీళ్లు సమృద్ధిగా ఉండాలని అవసరమున్నచోట మోటార్లను ఏర్పాటు చేశారు.నీళ్లు సమృద్ధిగా ఉంటే ప్రజలు తమ పనులను ఇబ్బంది లేకుండా చేసుకుంటారని సర్పంచ్ నవ్య మల్లచారి అన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్దే లక్ష్యంగా తాను ముందుకు వెళ్తానని అన్నారు.ఇంకా రాబోయే రోజులలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచాలని అందుకు మీరందరూ సహకరించాలని గ్రామ ప్రజల్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు సభ్యులు అల్వాల స్వప్న సుల్తాన్, ఉపసర్పంచ్ రాజు, రెండవ వార్డు సభ్యులు, సురేష్, ఆరవ వార్డు సభ్యులు శ్రీను, పరమేష్, లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *