
పయనించే సూర్యుడు మార్చి 5 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ జిల్లా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి జిల్లా టీఎన్జీవోల అధ్యక్షుడు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులతో కలిసి రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు తదితరులు కలిసి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ నివాసానికి వెళ్లి వారికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు కమిషనర్ కూడా ఉద్యోగులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. హోలీ పండుగ చిన్నా–పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలసి ఆనందంగా జరుపుకునే పండుగ అని నాయకులు పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా శీతాకాలానికి ముగింపు పలుకుతూ వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా హోలీని భావిస్తామని తెలిపారు డప్పు చప్పుల మధ్య జరిగిన ఈ రంగుల హోలీ సంబరాలు ఉద్యోగుల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని మరింత బలోపేతం చేశాయి ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగేం లక్ష్మణరావు అసోసియేట్ అధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి రాగి శ్రీనివాస్ సర్దార్ హర్మీందర్ సింగ్ పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంతరావు రూరల్ అధ్యక్షులు కోడూరి వాస్తవిక్ గౌడ్ కార్యదర్శి కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్ నాయకులు కోట రామస్వామి శంకర్ రమేష్ గౌడ్ ప్రసాద్ రెడ్డి ఎవి .రాజేశ్వరరావు నగేష్ గౌడ్ బైరి శ్రీనివాస్ కోటేశ్వర అల్లే శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు