
పయనించే సూర్యుడు మార్చి 5 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ కల్వకుర్తి పట్టణంలో మార్చి 8న ప్రారంభించబోతున్న ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన ప్రజాకవి గద్దర్ విగ్రహ ఆవిష్కరణ సభకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కార్యక్రమ వేదికను గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ అడ్వకేట్ శర్మ, బృంగి ఆనంద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ముఖ్య అతిథులు, కళాబృందాల సందడితో సభను కళాత్మకంగా, ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గద్దర్ స్ఫూర్తిని కొత్త తరాలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వేదిక అలంకరణ, అతిథుల కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు, భద్రతా చర్యలపై నిర్వాహకులు సమీక్షించారు. కార్యక్రమం విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కవి గాయకులు జక్కగోపాల్, నర్సిములు, సంజీవ, శేఖర్, రజిత, సదానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.