పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 5 సాలూర : హోలీ పండుగను పురస్కరించుకొని సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ మరియు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు కుస్తీలు పట్టడానికి తరలివచ్చారు. కుస్తీ పోటీలలో గెలుపొందిన మల్లయోధులకు గ్రామ పెద్దలు నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజ్ పటేల్, గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి, విడిసి అధ్యక్షులు తోకల అంజయ్య,పెద్దలు రాహుల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.