కోదండ రామాలయంలో శ్రీరామనవమి తొలితంతు వేడుక పూర్తి..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 5,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని పాత పినపాక గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా బుధవారం తొలితంతు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ నర్వనేని లక్ష్మణరావు ఆధ్వర్యంలో రాములోరిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. అదేవిధంగా మహిళా భక్తులతో పసుపు కొట్టుట, తలంబ్రాలు కలుపుట కార్యక్రమాలు వైభవ పేతంగా నిర్వహించారు. అర్చక స్వామి రఘురామాచార్యులు, శ్రీకృష్ణా చార్యులు వేడుకల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలను ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందుకు తగ్గట్లు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. శ్రీరామనవమి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు.