కోమటిరెడ్డి మోహన్ రెడ్డికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు..

పయనించే సూర్యుడు న్యూస్, మార్చ్ 05, బూర్గంపహాడ్ మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకొని ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి అకాల మరణం చెందారని తెలియజేయుటకు చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటూ పార్టీకి ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ లక్ష్మీపురం పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, బెల్లంకొండ రామారావు, బెల్లంకొండ వాసు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు