పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 5 పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదూరు గ్రామంలో ఎన్నో ఏళ్ళు తరబట్టి స్మశానం లేక ఎస్సీ కమ్మ్యూనిటి అవస్థలు పడుతుంటే ఆ సమస్యను గుమ్మడిదుర్రు వాసి నక్క వెంకట్రావు,(విలేఖర్) పొన్నం బాలాజీ దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ సమస్యను విన్న పొన్నం బాలాజీ వెంటనే తన వంతు కృషిగా ఒక్క ఎకరం పొలం సొంత నిధులతో కొని స్మశాన వాటిక కేటాయిస్తాను అని హామీ ఇచ్చి దానిని నెరవేర్చటo పట్ల పలువురు ఎస్సీ కుల పెద్దలు హర్షo చేశారు.ఈ సందర్భంగా పొన్నం బాలాజీ మాట్లాడుతూ దూర ప్రాంతంలో ఉన్న తన కులం పట్ల ఎంతో మమతా అనురాగాలు కలిగిన వ్యక్తి నక్క వెంకట్రావు(విలేఖర్)అని ఈ స్మశాన సమస్యను తీసుకొని వచ్చి దీనిని ఎలాగైనా మీరు చేయాలి అని అంటే నేను ఏదో రకంగా చేస్తా అని నక్క వెంకట్రావు (విలేఖర్)కు హామీ ఇవ్వడం జరిగిందని, దానికి ఇప్పుడు సమయం వచ్చి ఈ ఎకరం పొలాన్ని ఎస్సీ కులానికి స్మశాన వాటిక ఇవ్వడం జరిగిందని,అదేవిధంగా గ్రామంలో రాజకీయం కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలని మిగతా రోజుల్లో గ్రామ అభివృద్ధికి అందరు కూడా సహకరించాలని వీలైతే అభివృద్ధిలో పోటీ పడదాం కానీ కుట్రలు పన్నటం గొడవలు పెట్టడం అలాంటి వాటిల్లో నేను దూరంగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం బాలాజీ శ్రీమతి విజయలక్ష్మి గార్లకు ఎస్సీ కుల పెద్దలు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పొందూరు నాగేశ్వరరావు, నక్క వెంకట్రావు( విలేఖర్) , యార్లగడ్డ విశ్వనాథం, కంచెటి రాంబాబు, మండెపూడి రామ్మోహన్ రావు, నక్క సుధాకర్, నక్క చిన్న పుల్లయ్య, ఆలూరి శ్రీనివాసరావు, పలువురు గ్రామ రైతులు, ఎస్సీ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు
