
పయనించే సూర్యుడు మార్చి 5 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరపాలక సంస్థ 2025-2026 ఆర్ధిక సంవత్సరం మార్చి 31 తో ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం రోజు కార్యాలయ ఆవరణలో గల కళాభారతి లో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆద్వర్యంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నుల వసూళ్ళు పై మేయర్ కొలగాని శ్రీనివాస్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది కి పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 26 రోజుల గడువు మాత్రమే ఉన్నందున ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బందిని రెవెన్యూ విభాగం తో సమన్వయం చేస్తూ అధికారులు, సిబ్బందితో కలిపి డివిజన్ల ప్రకారం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్ల వారిగా ప్రత్యేక టీంలు ఆస్తి పన్నుల వసూళ్లు చేయడం జరుగుతుంది. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ డిమాండ్ ప్రకారం వంద శాతం పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. ఉదయం టీంల ప్రకారం ఫీల్డ్ లెవల్ లో వెల్లి ప్రజలతో మమేకమై పన్నులు వసూళ్లు చేయాలన్నారు. పన్నులు వసూళ్లు చేసే సమయంలో అధికారులు సిబ్బంది ప్రజలతో మర్యాద వ్యవహారించి నగర అభివృద్ధికి సంబంధించి ఆస్తి పన్ను ఎంత అవసరమో అన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగేలా వివరించాలన్నారు ప్రజలను టాక్స్ చెల్లించి కరీంనగర్ అభివృద్ధి కి సహాకరించాలని ఫీల్డ్ లెవల్ లో సిబ్బంది అధికారులు ప్రజలకు తెలుపాలన్నారు. ఆస్తి పన్నుల వసూళ్లు పై గౌరవ కార్పోరేటర్లు కూడ సహాకారం అందించాలని పిలుపు నిచ్చారు. ఆస్తి పన్నుల వసూళ్లు లో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహారిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ రోజు వారి డిమాండ్ ప్రకారం పన్నులు వసూళ్లు చేయాలన్నారు. మొండి బకాయి దారుల పై ఒత్తిడి పెంచి పన్నులు చెల్లించకుంటే మున్సపల్ చట్టం ప్రకారం చర్యలు తీస్కోవాలన్నారు. అధికారులు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజల నుండి అధికారుల పై ఫిర్యాదు వస్తున్నాయని సెక్షన్ వారిగా అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. నగర ప్రజలకు పారదర్శకంగా జవాబు దారి తనంగా అధికారులు పని చేయాలని హెచ్చరించారు. 26 రోజుల గడువులోగా ఆర్వో, ఆర్ ఐ, వార్డు ఆపీసర్ వారిగా మీ టార్గెట్ ప్రకారం రావల్సిన 30 కోట్ల డిమాండ్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆఫీస్ భవనాలకు సంబంధించి ప్రాపర్టి టాక్స్ కు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని ఆ విషయం పై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీస్కేల్తామని తెలిపారు. కమర్షియల్ టాక్స్ బకాయి దారులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీస్కోవాలన్నారు. అధికారులు భాధ్యతలు మరిచి విధులు నిర్వర్తించడం సరి కాదని హెచ్చరించారు. మరో వైపు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ డిమాండ్ ప్రకారం వసూళ్లు చేయాల్సిన మొత్తం పన్ను పూర్తి చేసి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలన్నారు. టాప్ 100 మొండి బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని. పన్ను చెల్లించని వారి నల్లా కలెక్షన్, ఎలక్ట్రసిటి కనెక్షన్ తొలగించాలన్నారు. వ్యాపార దుకాణ దారులు పన్నులు చెల్లించకుంటే దుకాణాలు సీజ్ చేయాలన్నారు. ఆర్ ఓ ఆక్టును కూడ అమలు చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. మార్చి 15 తేది లోగా టార్గెట్ పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. అన్ స్ట్రక్చర్ సంబంధించి తొలగించిన ఇంటి నెంబర్ల డిమాండ్ ను తొలగించేలా చర్యలు తీస్కోని అన్ కలెక్టెబుల్ ప్రాపర్టి టాక్స్ వివరాలు అందించాలన్నారు. ప్రత్యేక టీం ప్రకారం ఉదయం 7 గంటలకే అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఫీల్డ్ లో కెల్లి పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. అసెస్మెంట్ ప్రకారం ప్రతి ఇంటికి తిరిగి పన్నులు వసూళ్లు చేయాలన్నారు. నగర ప్రజలు 2025-2026 ఆర్థిక సంవత్సరం మీ యొక్క పన్నులను తప్పక చెల్లించి నగర అభివృద్ధి కి సహాకరించాలన్నారు. వన్ టైం సెటిల్ మెంట్ స్కీం, వడ్డీ మాఫీ లాంటి స్కీం ల పై ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేవని గడువు లోగా పన్నులు చెల్లించాలన్నారు. విలీన గ్రామల డివిజన్ల ప్రజలు కూడ మీ యొక్క డిమాండ్ ప్రకారం పన్నులు తప్పక చెల్లించాలన్నారు. క్యాపిటల్ వాల్యు ప్రకారం ఆస్తి పన్నులు అబ్ డేట్ అవడం జరిగిందని అందులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. ఉన్న టాక్స్ ప్రకారం గడువులోగా పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధి కి సహాకరించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమీషనర్లు వేణు మాధవ్ ఖాధర్ మొహియుద్దీన్, ఎస్సీ రాజ్ కుమార్, ఆర్పోలు,ఎస్, ఆర్ ఐలు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
