డ్రైన్లు పూడిక తీయక కాలనీవాసులు ఇబ్బందులు..

పయనించే సూర్యుడు మార్చి 5, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) డ్రైన్లు నిర్మించారు కానీ వాటిని ఏళ్ల గడుస్తున్న పూడికలు తీయక పోవడంతో నానా చెత్త చెదారం ఏర్పడి తద్వారా దోమల ప్రబలి కాలనీవాసులకు వ్యాధులు ప్రవళి ఆసుపత్రి పాలవుతున్నారని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ రాజాజీ నగర్, ఎఫ్సీఐ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ, జగదీష్ లు మాట్లాడుతూ సంవత్సర కాలంగా డ్రైన్ పూడిక తీయలేకపోవడంతోటే నివాసులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారికి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తే అసహ్యించుకుంటున్నాడని కనీసం గౌరవించట్లేదని మర్యాద మంచి లేకుండా మాట్లాడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎఫ్సిఐ కాలనీలో మురుగునీరు నిలవ ఉండడంతో ఆ ప్రాంతమంతా పందులు పశువులు ఆ మురుగునీడిలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని దోమలు విపరీతంగా ఉండటంవల్ల అనేక రోగాలు వస్తున్నాయని కనీసం దోమల మందు గానీ, వాడటం లేదని అడిగితే పంచాయతీలో డబ్బులు లేవంటూ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతున్నాడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *