తిరుమలలో భక్తి భావంతో కమ్మ ప్రభాకర్ నాయుడు కుటుంబం

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 5 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర తోమాల సేవలో నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మరియు యూనిట్ ఇంచార్జ్ కమ్మ ప్రభాకర్ నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించే తోమాల సేవను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *