పయనించే సూర్యుడు, మార్చి 5 నాగర్ కర్నూల్ జిల్లా,తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ నాగర్ కర్నూల్ జిల్లా.తెలకపల్లి మండల సమీపంలో కల్వకుర్తి రహదారిలో బొగ్గుబట్టిలో గత ఐదు సంవత్సరాలు నుండి పెట్టి చాకిరీలో కూలీల ఉన్నట్లు అధికారులు బుధవారం గుర్తించారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వి వై కాలనీకి చెందిన గిరిజన కూలీలుగా గుర్తించడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఇండియా లేబర్ లైవ్ సంస్థ మరియు కోనేరు స్వచ్ఛంద సంస్థ వారు, గురువారం నాగర్ కర్నూల్ ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా. వెంటనే ఆర్డీవో, సురేష్ తెలకపల్లి తాసిల్దార్ విజయ్ కుమార్ కు ఆదేశించడంతో వెంటనే తాసిల్దార్ విజయ్ కుమార్ బృందం మరియు పోలీసు బృందం ఎస్సై నరేష్ , జిల్లా లేబర్ అధికారి రాజకుమార్. జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ డిసిపిఓ శ్రీశైలం. ఆధ్వర్యంలో వెంటనే కూలీలను వెట్టి చేయించుకుంటున్న స్థలం దగ్గరికి చేరుకున్నారు. అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి వెట్టిచాకిరి బొగ్గుబట్టీలలో మగ్గుతూ పని చేస్తున్నామని గిరిజన చెంచు కుటుంబాలు గోడునా విలపించారు. మమ్మల్ని ఎలాగైనా రక్షించండి . మమ్మల్ని విముక్తి కల్పించి మ స్వగ్రామానికి తరలించండి అంటూ అధికారుల కాళ్లపై పడి వేడుకుంటున్నారు. అధికారులు మీకు రక్షణగా ఉంటాము మేము మిమ్మల్ని రక్షించి మీ ప్రాంతానికి పంపిస్తామంటూ వారు భరోసా ఇచ్చారు. పనిలో ఉన్నటువంటి ఆరు కుటుంబాలకు 29 మంది కూలీల మరియు పిల్లల విముక్తి కల్పించి జిల్లా కార్మిక శాఖ మరియు జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులకు అప్పగించారు. బొగ్గు బట్టీ యజమాని లాలుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటా మ ని. తాసిల్దార్ విజయ్ కుమార్ మరియు ఎస్ఐ నరేష్ తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి రాజకుమార్. డిసిపియు శ్రీశైలం. దళిత బహుజన రిసోర్సెంటర్ అధ్యక్షులు సురేష్ బాబు. విజయ, ఈశ్వర్ ,కోనేరు కోఆర్డినేటర్ ఆంజనేయులు. ఏరియా కోఆర్డినేటర్ జాకీర్ హుస్సేన్. రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామస్వామి. చైల్డ్ హెల్ప్ లైన్ ప్రమీల. తదితరులు ఉన్నారు.