నాగేపల్లి లో ఘనంగా హోలీ సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -05 రామగిరి మండల నాగేపల్లి గ్రామంలో బుధవారం హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలలో యువకులు , విద్యార్థులు ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొని ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ పురాణ కథ ప్రకారం చెడుపై మంచి గెలిచిన దానికి సంకేతం హోలీ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాశం సతీష్, మాజీ ఎంపిటిసి తీగల భూమయ్య, బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, శివ,కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల ప్రజలు, మహిళలు,యువకులు హోలీ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.