పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 05 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ముందు వెళ్తున్న బైకును స్కూటీ పై వెళ్తున్న కృష్ణయ్య వయస్సు 60 సంవత్సరాలు బైకును ఢీకొన్నాడు. ఇతడు నాగసాల నుంచి బయలుదేరి రేవల్లి గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో యాక్సిడెంట్ కావడం జరిగింది. అతడి స్కూటీ డిక్కీలో 50,000/-వేల రూపాయలు మరియు మొబైల్ ఫోన్ ఉన్నాయి వాటిని తీసుకొని వెళ్లి వారి కుటుంబ సభ్యులకు సిహెచ్సి జడ్చర్ల లో మిడ్జిల్ మండలానికి చెందిన 108 సిబ్బంది పైలెట్ ఎండి గౌస్ మరియు ఈఎంటి శివకుమార్ వారు నిజాయితీగా వారి కుటుంబ సభ్యులను పిలిచి డబ్బు మరియు ఫోను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.