నేషనల్ లైన్ మెన్స్ డే…

పయనించే సూర్యుడు మార్చి 05 భీమదేవరపల్లి:- నేషనల్ లైన్‌మెన్స్ డే సందర్భంగా హుజురాబాద్లో డీఈఈ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, భీమదేవరపల్లి మండలం పరిధిలోని ముల్కనూర్ గ్రామంకు చెందిన హుజురాబాద్ రూరల్ సెక్షన్ సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ అలిగిరెడ్డి వెంకట రాజా రెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసినందుకు గుర్తింపుగా ఈ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… సేవాభావంతో పనిచేస్తున్న లైన్‌మెన్‌లు, అధికారులు విద్యుత్ శాఖకు మూలస్తంభాలుగా నిలుస్తున్నారని అభినందించారు..