పుంగనూరు పట్టణంలో ఈనెల 10 మరియు 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర కు సర్వం సిద్ధం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 05.03 2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలో 10, 11వ తేదీ లలో జరుగు. గంగమ్మ జాతర సందర్భంగా, పట్టణంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఉండేదానికి అలాగే కూడలిలో హెల్త్ సెంటర్లు, చలివేంద్రాలు, ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. అలాగే కౌన్సిలర్ఆమోదం మేరకు గంగమ్మ జాతర సందర్భంగా దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీమ్ భాషా తెలిపారు కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారుదొరవారి కుమారుడు మల్లికార్జున స్వామి పాల్గొన్నారు పట్టణంలోని చెరువు ముందర, బాయ్స్ కాలేజీ ఆవరణలో వెహికల్స్ పార్కింగ్ కొరకు మరియు ఆర్టీసీ డిపో దగ్గర, పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మరియు మున్సిపల్ అధికారులు, రెవిన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.