పేద విద్యార్థులకు చేయూత – పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 05 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పేద విద్యార్థులకు చేయూతనిద్దాం – చదువులమ్మ బిడ్డల ఆశయాలను గెలిపిద్దాం” అనే నినాదంతో బుధవారం కోసిగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎం. రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. ఈరేష్, పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపల్ ఉమాదేవి హాజరయ్యారు. వారు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్రజ, దేవి, కళ్యాణి, శ్రీదేవి, సుజాతమ్మ, యశోద, జానకి, శ్యామల, రావలి, ప్రవీణతో పాటు ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజి, నాయకులు ప్రకాష్, జీవన్, వీరేష్, రాజు, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *