ప్రజల ప్రశంసలు అందుకున్న అరిగేలా రాకేష్.

★ తన అభివృద్ధిని గుర్తిస్తూ సన్మానించిన మైనార్టీ యువకుడు (లీడర్ ఫహీం).

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 5 పట్టణంలోని 15 వ వార్డు లో నూతనంగా ఎన్నుకోబడిన అరిగెల అనూష భర్త అయినా అరిగెల రాకేష్ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. గెలిచిన నెల రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడని. .అంతేకాకుండా వార్డు అభివృద్ధి పనులు చక చక మొదలుపెట్టేసారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత చాలా ఉంటుంది. వేసవి కాలం మొదటి నెలలో నే ట్యాంకర్ల తో గడప గడపకు నీరు అందించడం జరిగింది. చాలా రోజుల నుంచి డ్రైనేజీలలో పేరుకపోయినా చెత్త పూడికతీతలు .అంతే కాకుండా వార్డులో ఒక బీద కుటుంబ పెద్ద చనిపోతే అంత్యక్రియలకు గాను ఐదువేల రూపాయలు(5,000) మరియు నెలకు సరిపడు నిత్యవసరాల సరుకులు అందించడం జరిగింది. మునుముందు కూడా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి దిశగా పనులు చేయిస్తానన్నారు.