ప్రభాకరన్ హత్య కేను చేదించిన మన పోలీసులు

పయనించే సూర్యుడు మార్చి 5 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా తడ మండలం పెరియవట్టు గ్రామంలో గత నెల 28 న సంచారం సృష్టించిన ప్రభాకర న్‌ హత్య కేసును మన పోలీసులు ఛేదించారు ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులును ఎలాగైనా పట్టుకోవాలని రేయనక పగలనక ఈ కేసును త్వరగా చేదించాలని మన పోలీస్ వారు అనుకోని ఎట్టకేలకు బుధవారం ఉదయం నాలుగో తారీఖున ముగ్గురు నిందితులు తడ రాఘవ కాంప్లెక్స్ పక్కన పాతబడిన హాస్టల్ భవనంలో ముగ్గురు నిందితులు దాకున్నట్లు సమాచారం అందటంతో మెరుపు వేగంతో నిందితులు దాకున్న దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేసిన మన పోలీసు వారు అనంతరం డీఎస్పీ చెంచు బాబు మీడియాతో మాట్లాడుతూ నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు. ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నా0 హత్య పెరియవట్టు మెయిన్ రోడ్డులో టైర్‌ పంచర్ షాప్ నడుపుకుంటున్న ప్రభాకరన్‌తో , అదే గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వి. దినేష్ , వి. సతీష్ అలియాస్ అప్పు . వి . విగ్నేష్ అలియాస్ విక్కీ అనే ముగ్గురు అన్నదమ్ముల కు ప్రభాకరన్‌ కి పాత కక్షలు ఉన్నాయి ప్రభాకర్ ని ఎలాగైనా అంతమొందిO చాలనే ఉద్దేశంతో ఎప్పుడు నుంచో కాసుకుని కూర్చున్న ముగ్గురు నిందితులు గత నెల 28వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో ప్రభాకరన్‌ ని అంతం చేయాలని ఉద్దేశంతో ముగ్గురు బైక్ పైన షాప్ వద్దకు వెళ్లారు అక్కడ ఉన్న ప్రభాకరన్‌ పైన కత్తులతో విచక్షణ రహితంగా తల పైన, మఖం పైన , మెడ పైన నరికి అతి కిరాతకంగా చంపి అక్కడి నుండి పరారయ్యారు నిందితుల పైన తడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 33 / 20 26 ప్రకారం కేసు నమోదు చేసి . వారిని రిమాండ్ నిమిత్తం సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు . సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ , తడ ఎస్‌ణ కొండప్ప నాయుడు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మరియు డీఎస్పీ అభినందించారు