మెట్ పల్లిలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు

★ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 5 హోలీ పండుగ సందర్భంగా మెట్ పల్లిలో వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో జరిగిన వేడుకల్లో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీ నేతలు, కుల, యువజన సంఘాలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, కుల, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.