పయనించే సూర్యుడు-05-03-2026-రాజంపేట న్యూస్ : స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర మెయిన్ రోడ్డు ప్రక్కన జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చిన వారిని జనసేన పార్టీ "ఉద్యమి" లుగా చేర్పించడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమము జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు జనసేన పార్టీ "సాధక్" లతో జోరుగా కొనసాగిస్తున్నారు. పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత, పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరని ఈ సందర్భంగా సాధక్ లు తెలియజేశారు. సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు, శిక్షణ, నాయకులుగా ఎదిగే అవకాశాలు, రూ 5 లక్షల ప్రమాద బీమా ద్వారా కుటుంబానికి భరోసా లభిస్తుందని తెలియజేశారు. వివరాలకు 6305399037 నంబర్ ను సంప్రదించాలని కోరారు.