రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు ఎంపికైన కోరపల్లి విద్యార్థి.

★ ఇన్స్పైర్ అవార్డ్ 2025 -26

పయనించే సూర్యుడు మార్చ్ 05 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి జడ్పీహెచ్ఎస్ కోరపల్లి పాఠశాల కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి రొంటాల సాయి రిత్విక్ జంతువుల బారి నుండి పంటల రక్షణ కొరకై తయారుచేసిన స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అనిమల్స్ రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డ్ కు 2025- 26 ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఇట్టి ఇన్నోవేషన్ కి గైడ్ టీచర్లుగా వ్యవహరించిన పెండెం శ్రీనివాస్ మరియు రవికాంత్ రాజులను ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.