రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన కౌన్సిలర్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్‌పల్లి, మార్చి 5: మెట్‌పల్లి మున్సిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్‌గా నూతనంగా ఎన్నికైన బత్తుల నరేష్ బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. కౌన్సిలర్‌గా విజయం సాధించిన తర్వాత మొదటిసారి మంత్రి కార్యాలయానికి వెళ్లిన ఆయన, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రితో చర్చించినట్లు సమాచారం. కౌన్సిలర్‌గా ఎన్నికైన నరేష్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు. ప్రజలు నమ్మకంతో గెలిపించినందుకు, నిరంతరం ప్రజల చెంతనే ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మెట్‌పల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కౌన్సిలర్ బత్తుల నరేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ రక్షక దళ్ అధ్యక్షులు రెంజర్ల రాజేష్, ఎన్నం రమేశ్, తరాళ్ల కార్తీక్, బిట్లుగు కార్తీక్. దుర్గం సిద్దార్థ రామ్మూర్తి. ఆనందం తదితరులు పాల్గొన్నారు.