లక్ష్మమ్మ పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాళి

​పయనించే సూర్యడు మార్చి 05 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రేఖ లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బుధవారం వారి గ్రామాన్ని సందర్శించారు. ​లక్ష్మమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. లక్ష్మమ్మ మృతి వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు ఓటు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు మరియు గ్రామ శాఖకు చెందిన ఇతర బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.