
పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 05 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):పట్టణంలో టీడీపి పార్టీ కార్యాలయం వద్ద పట్టణ టిడిపి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో దివంగత నేత వరుపుల రాజా వర్థంతి సందర్భంగా బుధవారం రాజా చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రములో రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు.భవిత దివ్యాంగుల పాఠశాలలో చిన్నారులకు అన్నదానం చేపట్టారు. జె.అన్నవరం గ్రామ టీడీపి నాయకులు ఆరక రాజు భవిత పాఠశాలకు నాయకుల సమక్షంలో మూడు సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారు.ఈ సందర్భముగా గోపి మాట్లాడుతూ వరుపుల రాజా తో వున్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు విద్య, వైద్యము, కోసం అను నిత్యం పాటూపడే మహానీయుడు వరుపుల రాజా అని అన్నారు. భౌతికంగా రాజా లేకపోయినా నియోజకవర్గ ప్రజలందరి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయుడు చిన్న, ఎండగుండు నాగబాబు, మామిడి లలిత, కోణాల వెంకటరమణ, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్, సిహెచ్సి వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు, జిగటాపు సూరిబాబు, కరోతు సత్యనారాయణ, సామంతుల గోపాలకృష్ణ, సామంతులు రాంబాబు, గొల్లపూడి త్రిమూర్తులు, మండల నాయకులు పలివెల శీను, పెంటకోట శ్రీధర్, పెంటకోట కృష్ణ, సిరిపురం శివ, మోర్తా నాగేశ్వరరావు, తదితర వరుపుల రాజా అభిమానులు పాల్గొన్నారు.