వైసీపీ గ్రామ కమిటీల జాబితా మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అందజేత

* ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ బి. రామ్మోహన్ రెడ్డి, దొడ్డి మేకల సర్పంచ్ చంద్రశేఖర్‌

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 05 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ గ్రామ కమిటీల డిజిటలీకరణకు శ్రీకారం రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయితీల గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల డిజిటలీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2,200 మందిని గ్రామ కమిటీలలో ఏర్పాటు చేసి, వారి పూర్తి వివరాలను సేకరించి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ బి. రామ్మోహన్ రెడ్డి, దొడ్డి మేకల సర్పంచ్ చంద్రశేఖర్‌ ఎమ్మెల్యేకు అందజేశారు. గ్రామ స్థాయిలో పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడం, భవిష్యత్ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా ఈ డిజిటలీకరణ చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల స్థాయి పార్టీ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *