సర్పంచ్ లు వార్డుమెంబెర్లు ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలు అందించాలి

★ ఎమ్మెల్యే జారె

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 5 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రైతు వేదికలో గ్రామపంచాయతీ ఎన్నికలలో తాజాగా విజయం సాధించిన వార్డు సభ్యుల కోసం మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ శిక్షణ మూడు విభాగాలు గా నిర్వహించబడునుండి తొలి విడత కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామ అభివృద్ధికి పునాది రాయి వంటిదని మౌళిక వసతులు ప్రాథమిక అంశాల్లో వార్డు సభ్యుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి ధర్మమని ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తేనే గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే గ్రామాల్లో పటిష్టమైన నాయకత్వం అవసరమన్నారు గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు ఎంపీడీవో అప్పారావు ఎంపీఓ రామకోటారెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు