సామరస్యానికి ప్రతీక “హోలీ”

★ ఎస్సై దివ్య,సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ ★ వంగర లో ఘనంగా హోలీ వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 05 భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో హోలీ పండుగ వేడుకలు బుధవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎస్సై దివ్య,గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్,ఉప సర్పంచ్ ఒల్లాల రమేష్ పాల్గొని ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై దివ్య మాట్లాడుతూ, వంగర గ్రామంలో ప్రజలందరూ కలిసికట్టుగా, ప్రశాంతమైన వాతావరణంలో హోలీ జరుపుకోవడం అభినందనీయమన్నారు. పండుగలు మనుషుల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, అందరూ కలిసిమెలిసి ఉండటమే సమాజ సామరస్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లోమార్కెట్ కమిటీ వైస్ చైర్మన్: స్రవంతి, వార్డ్ సభ్యులు శ్రీరామోజు మొండయ్య, మిడిదొడ్డి తిరుపతి, మారం సతీష్, రఘునాయకుల మహేష్, వేముల సాధన, కండె శారద,కాల్వ అంజలి, గజ్జెల రమేష్, మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ సుహాసిని, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి, చెప్యాల తిరుపతి రెడ్డి,ఆర్.వెంకట్ రెడ్డి, కాల్వ సంపత్, బత్తిని అశోక్, బత్తిని రాజు, గజ్జెల సంజీవ్ రామారాపు మైసయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి దేవరాజు, మహిళా నాయకులు పాల్గొన్నారు.