పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 5 బోధన్: సాలూర మండల కేంద్రంలో బుధవారం కుమ్మన్ పల్లి హున్సా ఖాజాపూర్ మందర్న గ్రామాలలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. యువకులు మహిళలు చిన్నారులు ఉదయం నుంచి రంగులు పోసుకొని సంబరాలు జరుపుకున్నారు.ఒకరికి ఒకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులు పూసుకున్న యువకులు ఓక్క దగ్గరికి చేరి స్మార్ట్ ఫోన్లతో సెల్ఫీలు దిగారు. విందులు చేసుకున్నారు.ఈ సంబరాలలో మండల గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
