పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /05: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం సిరిసిల్ల నుండి వేల్జిపూర్ మీదుగా ఇల్లంతకుంటకు నూతన బస్సు సేవలను మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సహకారంతో నేడు బస్సు సేవలను గ్రామ ప్రజలందరితో కలిసి ప్రారంభించిన వేల్జిపూర్ గ్రామం సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, సర్పంచ్ మాట్లాడుతూ. బస్సు సేవలను గ్రామ ప్రజలు వినియోగించి ఆక్యుపెన్సిని పెంచాలని కోరారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ తో_ పాటు మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లకోమటి శంకర్ యాదవ్ , సీనియర్ నాయకులు మూల బాల్ రెడ్డి , బొల్లారం పరశురాములు, వార్డ్ మెంబర్లు బోజ్జ శ్రీనివాస్, దేశెట్టి కవిత, సంగేపు ముత్తవ్వ, వేములవాడ భారతి, బొల్లారం ప్రసన్నకుమార్, మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.