సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలు

* కల్వచర్ల శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ నూక రమేష్-వాణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహణ.

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -05 భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి సాంప్రదాయబద్దంగా గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపించి రామభక్తులు తమ భక్తిని చాటుకున్నారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఈ వెంకట్ రావు సూచనల మేరకు లోక కళ్యాణం కోసం శ్రీరామనవమి సందర్భంగా జరిగే వేడుకల్లో భాగంగా గోటితోని తలంబ్రాలు తీయుట, పసుపు కొమ్ములు దంచుట, తలంబ్రాలు కలుపుట కార్యక్రమాన్ని కల్వచర్ల బస్టాండ్ వద్దగల సాయినిలయంలో మహిళలు ఆకుపచ్చ చీరలు ధరించి, పురుషులు తెలుపు వస్త్రాలు, స్కార్ఫ్ ధరించి భగవన్నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.కల్వచర్ల శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ నూక రమేష్-వాణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేండ్ల శారద, ఆలయ కమిటీ చైర్మన్ రేండ్ల కుమారస్వామి, రామిడి వెంకటేశ్వర్లు-సుజాత, కొండ సమ్మయ్య- కనుకమ్మ, భాస్కర్-స్వరూప, తాటిపాముల శ్రీనివాస్ -రాజ్యలక్ష్మి, పుల్లూరి అన్వేష్ -మణిదీపిక, గుండా శంకరయ్య-జయప్రద, పల్లెర్ల శ్రీధర్-సరిత దంపతులతో పాటు గుండా కవిత, గుండా పద్మ శ్రీనివాస్, తోట నవీనప్రసాద్, కొమురవెల్లి జయసుధ, కొత్త పద్మ – వరలక్ష్మి, నాంసాని విజయ, పల్లెర్ల సవిత శ్రీధర్, బండి రమాదేవి, గసిగంటి రాజయ్య, తదీతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *