హెచ్ఐవి ఎయిడ్స్ మరియు టిబి కళా ప్రదర్శన

* "లింక్ వర్కర్ స్కీం ప్రాజెక్ట్ ఉప్పలయ్య ఆదేశాల మేరకు"

పయనించే సూర్యుడు మార్చి 5 రాజేష్ ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి సహకారంతో స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ స్కోప్ ఆధ్వర్యంలో లింకు వర్కర్ స్కీం ప్రాజెక్ట్ పిడిఎఫ్ ఉప్పలయ్య సార్ ఆదేశాల మేరకు హెచ్ఐవి. ఎయిడ్స్ మరియు టీబి. నియంత్రణపై అవగాహన కళాజాత ప్రదర్శన కనకదుర్గ కళా సమితి భుజంగం పొన్నాల. బృందం వారు ఈరోజు దౌల్తాబాద్ మండలంలో కళాకారులు తమ ఆటపాటలతో హెచ్ఐవి ఎయిడ్స్ పైన ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించారు. ప్రజలు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్రమత్తంగా ఉండాలని సుఖ వ్యాధులు ఉన్నవాళ్లు సురక్ష కేంద్రానికి వెళ్లాలని ఎయిడ్స్ అంటువ్యాధి కాదని హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వారిపట్ల విపక్ష చూపకూడదని హెచ్ఐవి ఎయిడ్స్ పై ఏ విధంగా సోకుతుందో. టీబీ సోకిన ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు భుజంగం. దాసు. కృష్ణ. నిర్మల. గ్రామ సర్పంచ్. అనురాధ రమేష్. ఉప సర్పంచ్ బాలకృష్ణ. మరియు పాలకవర్గం సభ్యులు. మెదక్ స్కోప్ స్వచ్ఛంద సంస్థ డిఆర్పి. సుస్మిత. సూపర్వైజర్. జ్యోతి. సి ఎల్ డబ్ల్యూ. పి .మమత. ఆశా వర్కర్. బాలమణి. అంగన్వాడి టీచర్ సరోజ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *