పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 బోధన్ :బోధన్ మండలం రాంపూర్ గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డోలే సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు., చిన్నారికి మొదటిసారి సర్పంచ్ అన్నం నీ తినిపించి వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను మరియు పౌష్టికాహారం ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోలే. సాయికుమార్ పంచాయతీ సెక్రటరీ ఆరీఫ్, గ్రామస్తులు , అంగన్వాడీ పిల్లలు ,టీచర్ కంటే సుమలత, ఆయా, మాజీ ఉపసర్పంచ్ దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.