అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సర్పంచ్

★ పిల్లల ఆరోగ్య ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో కీలకం ★ నక్క వాని గూడెం సర్పంచ్. పోతుల వెంకటేష్ యాదవ్

పయనించే సూర్యుడు, మార్చ్ 6, పచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని నక్కవానిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పోతుల వెంకటేశం యాదవ్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ మరియు సంరక్షణపై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా అన్న దానిపై ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలోని హాజరు పట్టీలను పరిశీలించిన సర్పంచ్ పిల్లల హాజరు పరిస్థితి, వారికి అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణీలు మరియు బాలింతలకు అందిస్తున్న పోషకాహార పంపిణీ గురించి అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో పాటు పరిశుభ్రతను కూడా ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పోతుల వెంకటేశ్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలంటే అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంగన్వాడీ సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ చిన్నారుల ఆరోగ్యాభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామంలో పిల్లల సంక్షేమం కోసం అవసరమైన సహకారం అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టెల స్వామి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ మాధవి భాస్కర్ రెడ్డి, బొమ్మిడి దయాకర్ రెడ్డి, గోదల యాదగిరి, కృష్ణ , స్వామి,జక్కుల విజయ్, గోదాల కృష్ణ,క్రాంతి, సిద్ధులు,పోతుల రవి తదితరులు పాల్గొన్నారు.