అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చడం పై మండిపడ్డ దళిత సంఘాలు

* "అందుకు కారణం అయిన ఆర్ అండ్ బి అధికారులను,గౌరారం ఎస్ ఐ కరుణాకర్ రెడ్డి ను సస్పెండ్ చేయాలి"

పయనించే సూర్యుడు మార్చి 6 దౌల్తాబాద్ రాజేష్) రాయపోల్ మండలంలో అనుమతుల పేరుతో అర్ధరాత్రి ఎవరికి సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం గద్దెను కూల్చివేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు బండారు దేవేందర్, మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాడెం కృష్ణ, దళిత సంఘాల నాయకులు గజ్వేల్ రామచంద్రం డిమాండ్ చేశారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద వర్గల్ మండలం నాచారం గ్రామంలో అంబేద్కర్ గద్దె కూల్చివేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అన్ని రంగాలలో నిష్ఠుడైన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాలు నిర్మించుకోవడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాచారం గ్రామంలో అనుమతి పేరుతో అర్ధరాత్రి గద్దెను తొలగించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంబేడ్కర్ విగ్రహాల పట్ల వివక్షతను చూపించడం సరైనది కాదన్నారు. ఈ దేశంలో సబ్బండ వర్గాల కోసం హక్కులు, చట్టాలు రాజ్యాంగం ద్వారా కల్పించి దేశ పరిపాలనకు దిక్సూచి చూపిన మహనయుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపడుతున్న మనువాదులను హెచ్చరిస్తున్నామన్నారు. ఈ దేశంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కడైతే గద్దెని కూల్చివేశారో అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకొని ప్రారంభిస్తామన్నారు. ఎవరైనా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, నాయకులు సొక్కం స్వామి, రాంపల్లి సతీష్, శ్రావణ్, శ్రీకాంత్, స్వామి, జిల్లా రాజు, లింగం, అనాజీపూర్ స్వామి, నవీన్, భానుప్రసాద్, భరత్, ఎల్లయ్య , నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *