
పయనించే సూర్యుడు మార్చి 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్లు వేసి ఆక్రమణ కట్టడాలు కట్టి మరల ముందుకు మరో ఆక్రమణ కట్టిన ఘటన కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడు వారి పాలెం జంక్షన్ వద్ద జరిగింది. గ్రామపంచాయతీకి సంబంధించిన రాయుడు వారి పాలెం జంక్షన్ కీలకం ప్రతిరోజు హెవీ ట్రాఫిక్ స్కూల్ బస్సులు లారీలు, ట్రాక్టర్లు తోపాటు వాహనదారులు అదే జంక్షన్ వద్ద తరచు తిరుగుతూ ఉంటారు. అయితే గతంలో షెడ్డు వేసుకుని అనుమతులు లేకుండా నివాసం ఉంటున్నవారు మరలా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా షెడ్డు ముందే మరో షెడ్డు వేశారు. ఇలాంటివి గ్రామంలో చాలా ఉన్నా కార్యదర్శి దీనిపై పట్టించుకోవడంలేదని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న షెడ్యూల్ తొలగించి ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని రాయుడుపాలెం వాసులు కోరుతున్నారు.